యూపీఎస్సీలో సత్తా చాటిన జిల్లా వాసి

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి కలెక్టర్ అయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన రాహుల్ ముదిరాజ్ కలెక్టర్‌గా ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు జిల్లా అధికారులు, గ్రామ, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వివరాళ్లోకి వెళితే… దామరగిద్ద మండలం ఒంటిబుర్జు(లక్మిపూర్) గ్రామానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు బి.నర్సింలు కుమారుడు రాహుల్ ఐఏఎస్‌గా ఎంపికైనట్టు వారి కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఇవాళ వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో నారాయణపేటకు […]

Update: 2020-08-04 06:18 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి కలెక్టర్ అయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన రాహుల్ ముదిరాజ్ కలెక్టర్‌గా ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు జిల్లా అధికారులు, గ్రామ, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వివరాళ్లోకి వెళితే…

దామరగిద్ద మండలం ఒంటిబుర్జు(లక్మిపూర్) గ్రామానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు బి.నర్సింలు కుమారుడు రాహుల్ ఐఏఎస్‌గా ఎంపికైనట్టు వారి కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఇవాళ వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో నారాయణపేటకు చెందిన బి.రాహుల్ అనే యువకుడు 272 ఆల్ ఇండియా ర్యాంకుతో సివిల్స్‌కు ఎంపికయ్యాడు.

రాహుల్ ఎంపిక పట్ల మండల పెద్దలు, యువకులు, రాజకీయ నాయకులతో పాటు జిల్లా ఎస్పీ కూడా అభినందనలు తెలియజేశారు. అంతేగాకుండా రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడి సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News