విద్యార్థికి సోనూసూద్ అదిరిపోయే సమాధానం..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విస్తృతవ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ మూలంగా సమస్త మానవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి కోసం, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు, విద్యార్థులు సైతం తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు. అయితే కార్మికుల సమస్యలు చూసి చలించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేశారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ విద్యార్థి సోనూసూద్‌ను సహాయం అడిగాడు. దానికి ఆయన స్పందిస్తూ ఎంతో విలువైన సమాధానం ఇచ్చారు. If you […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విస్తృతవ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ మూలంగా సమస్త మానవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి కోసం, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు, విద్యార్థులు సైతం తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు. అయితే కార్మికుల సమస్యలు చూసి చలించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేశారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ విద్యార్థి సోనూసూద్‌ను సహాయం అడిగాడు. దానికి ఆయన స్పందిస్తూ ఎంతో విలువైన సమాధానం ఇచ్చారు.
If you don’t have a PS4 then you are blessed. Get some books and read. I can do that for you 📚 https://t.co/K5Z43M6k1Y
— sonu sood (@SonuSood) August 6, 2020
కాగా ఆ విద్యార్థి ట్విట్టర్‌లో ‘ప్లీజ్ సర్, మీరు నాకు పీఎస్ 4 వీడియో గేమ్ ఇవ్వగలరా.. నా చుట్టూ ఉన్న పిల్లలందరూ ఈ లాక్‌డౌన్ టైంలో రకరకాల వీడియోగేమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు.’ అని నిలేశ్ అనే పదో తరగతి విద్యార్థి సోనూసూద్‌కు ట్వీట్ చేశాడు. దీనికి సోనూసూద్ స్పందించాడు. ‘మీకు పీఎస్ 4 లేకపోతే మీరు గొప్పగా ఎదుగుతారు. మంచి పుస్తకాలు చదవండి.. అవి నేను మీకు ఇప్పించగలను.’ అని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. విద్యార్థికి చాలా విలువైన సలహా ఇచ్చారంటూ సోనూసూద్‌ను నెటిజన్లు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ను 34,200 మందికి పైగా లైక్ చేశారు. 3,500 మంది దీనికి రీట్వీట్ చేశారు.