బ్రిడ్జి కూలుతోంది మహాప్రభో.. నిర్మాణం ఎట్లా..?

దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని  ఇందల్వాయి తండా గ్రామ శివారులలో వున్న చిన్న వాగు బ్రిడ్జి భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా కూలిపోయింది. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం నుంచి బ్రిడ్జ్ కూలుతూ వస్తుంది. స్థానిక సర్పంచులు చందర్ నాయక్, సత్తెవ్వ నర్సింలు, ప్రజా ప్రతినిధుల, పంచాయత్ రాజ్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు గానీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గానీ, పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు […]

Update: 2021-09-21 03:19 GMT

దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండా గ్రామ శివారులలో వున్న చిన్న వాగు బ్రిడ్జి భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా కూలిపోయింది. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం నుంచి బ్రిడ్జ్ కూలుతూ వస్తుంది. స్థానిక సర్పంచులు చందర్ నాయక్, సత్తెవ్వ నర్సింలు, ప్రజా ప్రతినిధుల, పంచాయత్ రాజ్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు గానీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గానీ, పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈసారి భారీ వర్షాలు కురవడంతో ఉన్న బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చిన్న వాగు బ్రిడ్జి నిర్మాణంను తొందరగా చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. త్వరగా ఈ సమస్యపై స్పందించి వివిధ గ్రామాల ప్రయాణికుల బాధలను తీర్చుతారని ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News