వ్యాక్సిన్ పై వింత ప్రచారం.. ఎక్కడంటే ?
దిశ, ఫీచర్స్ : కోవిడ్-19 మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను తోడేసింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధినుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కానీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ పై ప్రచారంలో ఉన్న అపోహలు, అపార్థాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ అపోహలు, అపార్థాలను వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రచారం చేసేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. తన ఇంటిముందు నిలువెత్తు అస్జిపంజరాన్ని ఏర్పాటు చేశాడు. ‘వ్యాక్సిన్ వేయించుకోనివారితో త్వరలోనే నేను కలుసుకుంటాను’ అని అస్జిపంజరం […]
దిశ, ఫీచర్స్ : కోవిడ్-19 మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను తోడేసింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధినుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కానీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ పై ప్రచారంలో ఉన్న అపోహలు, అపార్థాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ అపోహలు, అపార్థాలను వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రచారం చేసేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. తన ఇంటిముందు నిలువెత్తు అస్జిపంజరాన్ని ఏర్పాటు చేశాడు. ‘వ్యాక్సిన్ వేయించుకోనివారితో త్వరలోనే నేను కలుసుకుంటాను’ అని అస్జిపంజరం పక్కన బోర్డు పెట్టాడు.
అమెరికాలోని ఉత్తర కెరోలినాకు చెందిన జెస్సీ జోన్స్ తన ఇంటి ముందు అస్జిపంజరాన్ని ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనివారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా అస్థిపంజరం చుట్టూ సమాధుల నమూనాలను ఏర్పాటుచేశాడు. జెస్సి అత్త గతంలో కోవిడ్ 19తో బాధపడుతూ మృతిచెందింది. తన అత్తలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఇలా వినూత్న ప్రచారం చేపట్టానని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో ఈ అస్జిపంజరం ద్వారా హెచ్చరిస్తున్నాడు.