షార్ట్ సర్క్యూట్ తో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి
దిశ, మెదక్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన్ ఎల్లంపల్లి సిద్దిరాములు, వెంకటలక్ష్మి దంపతులు రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి భవాని (9) అనే కూతురు ఉంది. కూతురుని ఇంట్లో ఉంచి వరి కోత నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్ళారు. కాగా ఆదివారం […]
దిశ, మెదక్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన్ ఎల్లంపల్లి సిద్దిరాములు, వెంకటలక్ష్మి దంపతులు రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి భవాని (9) అనే కూతురు ఉంది. కూతురుని ఇంట్లో ఉంచి వరి కోత నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్ళారు. కాగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు, చుట్టూ పక్కల వారు ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయగా సకాలంలో రాకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఆ మంటల్లో చికుక్కున్న భవాని అగ్నికి ఆహుతయ్యింది. విషయం తెలుసుకున్న భవాని తల్లిదండ్రులు ఇంటి వద్దకు వచ్చేసారికే ఇంటికి పూర్తిగా మంటలు అంటుకున్నాయి.
చిన్నారి తండ్రి సిద్దిరాములు భవాని ని కాపాడే ప్రయత్నం లో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే తాము సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.