విశాఖ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రజలకు కేంద్రం తీపికబురు చెప్పింది. విశాఖలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం చేస్తున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానం ఇచ్చారు. దేశంలోని 35 నగరాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆదేశించింది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు […]

Update: 2021-07-26 10:52 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రజలకు కేంద్రం తీపికబురు చెప్పింది. విశాఖలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం చేస్తున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానం ఇచ్చారు.

దేశంలోని 35 నగరాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆదేశించింది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయాలని అనే దానిపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే విజయవాడలో అధ్యయనం పూర్తవ్వగా విశాఖలో ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందన్నారు. అయితే విజయవాడలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు ఆశించినంత డిమాండ్‌ లేనట్లు అధ్యయనంలో తేలిందని మంత్రి నితిన్ గడ్కరీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయవాడలో పార్క్‌కు సానుకూలంగా అవకాశాలు లేకపోవడంతో విశాఖలో దాదాపు పార్క్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News