మాస్క్ పెట్టుకొని భర్త.. భార్య ముందే అలా చేసిన సెక్యూరిటీ గార్డ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఈ  సమయంలోనే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని, భౌతిక దూరం పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వారి ప్రాణాలమీదకు తెస్తుంది. ఐతే ముఖానికి ధరించే ఈ మాస్క్ అప్పుడప్పుడూ పెద్ద గొడవలకే కారణమవుతోంది. జనాలు తిరిగే ప్రాంతంలో మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే.. మాస్క్‌ ఎందుకు లేదని పక్క వారు ప్రశ్నించడం.. నీకెందుకు అని వారు ఎదురు తిరగడం.. ఇలాంటి […]

Update: 2021-06-25 23:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని, భౌతిక దూరం పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వారి ప్రాణాలమీదకు తెస్తుంది. ఐతే ముఖానికి ధరించే ఈ మాస్క్ అప్పుడప్పుడూ పెద్ద గొడవలకే కారణమవుతోంది. జనాలు తిరిగే ప్రాంతంలో మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే.. మాస్క్‌ ఎందుకు లేదని పక్క వారు ప్రశ్నించడం.. నీకెందుకు అని వారు ఎదురు తిరగడం.. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇక తాజాగా మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తితో ఓ సెక్యూరిటీ గార్డ్ గొడవ ఏకంగా తుపాకితో కాల్చే వరకు వెళ్లింది. చిన్న నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

బరేలి జిల్లాలోలోని బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ కి రాజేశ్‌ కుమార్‌ అనే రైల్వే ఉద్యోగి శుక్రవారం తన భార్యతో కలిసి వెళ్ళాడు. అక్కడ ప్రవేశ ద్వారం వద్ద మాస్క్ పెట్టుకోవాలని సెక్యూరిటీ గార్డ్ విజ్ఞప్తి చేశాడు. మాస్క్ లేకుంటే లోపలికి పంపించబోమని స్పష్టం చేశాడు. దీంతో చిరెత్తుకొచ్చిన రాజేశ్‌ కుమార్‌ నా ఇష్టం .. నేను మాస్క్ పెట్టుకొను అంటూ సెక్యూరిటీ పై విరుచుకుపడ్డాడు. దాంతో అతడు కూడా రెచ్చిపోయాడు. మాటా మాటా పెరిగి.. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తన చేతిలో ఉన్న తుపాకీతో రాజేశ్‌ కుమార్‌ పై కాల్పులు జరిపాడు. భార్య కళ్లముందే భర్తను తుపాకీతో కాల్చడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Read More: బ్రేకింగ్: కత్తి మహేష్ కారుకు ప్రమాదం..

బుల్లెట్ నేరుగా రాజేశ్ తొడ భాగంలో దిగడంతో తీవ్ర రక్తస్రావమయింది. అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న భార్య బిగ్గరగా కేకలు వేయడంతో బ్యాంక్ లోపల ఉన్నవారందరూ బయటికి వచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం బాధితుడిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించారు. బుల్లెట్ తొడ భాగంలో దిగడంతో ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డ్ ను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News