ఆ విషయం నిలదీసే సరికి.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు..!

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : చిట్‌ఫండ్ డ‌బ్బుల కోసం ఇంటికొచ్చి ప‌రువు తీశాడ‌నే ఆగ్రహంతో గ‌ణేష్‌, కావ్య అనే భార్యభ‌ర్తలు రాజు అనే వ్యక్తిపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ అమాన‌వీయ సంఘ‌ట‌న శుక్రవారం సాయంత్రం హ‌న్మకొండలో జ‌రిగింది. చిట్‌ఫండ్ కంపెనీ చెల్లింపుల్లోని జాప్యమే ఏజెంట్‌-పొదుపుదారుడి కుటుంబాల మ‌ధ్య వివాదానికి దారితీసిన‌ట్లుగా తెలుస్తోంది. బాధితుడి భార్య మాన‌స హ‌న్మకొండ పోలీస్‌స్టేష‌న్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పోలీసుల‌కు అంద‌జేసిన […]

Update: 2021-09-03 07:16 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : చిట్‌ఫండ్ డ‌బ్బుల కోసం ఇంటికొచ్చి ప‌రువు తీశాడ‌నే ఆగ్రహంతో గ‌ణేష్‌, కావ్య అనే భార్యభ‌ర్తలు రాజు అనే వ్యక్తిపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ అమాన‌వీయ సంఘ‌ట‌న శుక్రవారం సాయంత్రం హ‌న్మకొండలో జ‌రిగింది. చిట్‌ఫండ్ కంపెనీ చెల్లింపుల్లోని జాప్యమే ఏజెంట్‌-పొదుపుదారుడి కుటుంబాల మ‌ధ్య వివాదానికి దారితీసిన‌ట్లుగా తెలుస్తోంది. బాధితుడి భార్య మాన‌స హ‌న్మకొండ పోలీస్‌స్టేష‌న్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పోలీసుల‌కు అంద‌జేసిన ఫిర్యాదులోని వివ‌రాల ప్రకారం… హ‌న్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం భ‌వ‌నం ప‌క్కన రాజు, మాన‌స దంప‌తులు సెల్‌షాపు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అచ‌ల చిట్‌ఫండ్ కంపెనీ ఏజెంట్‌గా ప‌నిచేస్తున్న గ‌ణేష్‌తో ఉన్న ప‌రిచ‌యంతో అతని ద్వారా రూ.10 ల‌క్షల చీటీ వేస్తున్నారు. అయితే న‌గ‌దు అవ‌స‌ర‌మై ఉండి రాజు నాలుగు నెల‌ల క్రితం చీటీ ఎత్తుకున్నాడు. చిట్‌ఫండ్ యాజ‌మాన్యం రేపు మాపంటూ తిప్పుతూ నాలుగు నెల‌లు గ‌డిపింది. రాజు గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో మీ ఏజెంట్‌తో రావాల‌ని, డ‌బ్బులు ఎప్పుడు ఇస్తామో అత‌నికి చెప్పిన‌ట్లుగా తిరిగి ద‌బాయించారు.

నాలుగు రోజుల క్రితం గ‌ణేష్‌ దంప‌తుల‌తో వాగ్వాదం..

యాజ‌మాన్యం డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో రాజు, మాన‌స దంపతులు గ‌ణేష్ నివాసానికి వెళ్లి ఇదే విష‌య‌మై నిల‌దీశారు. నువ్వు చెప్పినందువ‌ల్లే చీటీ వేశాన‌ని, ఇప్పించే బాధ్యత కూడా నీదే అంటూ గ‌ణేష్‌తో రాజు, మాన‌స దంప‌తులు వాగ్వాదానికి దిగారు. చీటీ వేయించ‌డం వ‌ర‌కే త‌మ బాధ్యత‌ని, చిట్‌ఫండ్ కంపెనీ చెల్లించ‌క‌పోవ‌డానికి త‌మ‌కేం సంబంధమ‌ని గ‌ణేష్ భార్య కావ్య కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇరువురు భార్య భ‌ర్తల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం, బూతు మాట‌లు న‌డిచిన‌ట్లుగా సమాచారం. ఈ వాగ్వాద‌మే శుక్రవారం దాడికి దారితీసిన‌ట్లుగా తెలుస్తోంది.

క‌స్టమ‌ర్‌గా షాపులోకి వ‌చ్చి… కాల్చేశారు…

శుక్రవారం నాలుగంట‌ల స‌మ‌యంలో క‌స్టమ‌ర్‌గా షాపులోకి ప్రవేశించిన గ‌ణేష్, కావ్య దంపతులు వెంట తెచ్చుకున్న డీజిల్‌ను రాజు, మాన‌స దంప‌తులపై గుప్పించారు. మాన‌స‌పై డీజిల్ ప‌డ‌లేదు. వెంట‌నే ఆమె షాపు బ‌య‌ట‌కు ప‌రుగెత్తింది. రాజు షాపు నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న క్రమంలోనే లైట‌ర్ వెలిగించి మీద‌కు విస‌ర‌డంతో మంట‌ల్లో చిక్కుకున్నాడు. రాజు మంట‌లతోనే రోడ్డుపైకి ప‌రుగెత్తడంతో స్థానికులు దుప్పట్లతో మంట‌లార్పేశారు. అయితే అప్పటికే రాజు శ‌రీరం 80శాతం కాలిపోయింది. ఎంజీఎం ఆస్పత్రికి త‌ర‌లించ‌గా చికిత్స అంద‌జేస్తున్నారు. రాజు చావు బ‌తుకుల‌తో పోరాడుతున్నట్లు కుటుంబ స‌భ్యులు వెల్లడించారు.

Tags:    

Similar News