వాగులో చిక్కుకున్న వెంకయ్య
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని మున్నేరువాగులో గురువారం వెంకయ్య అనే వ్యక్తి చిక్కుకున్నాడు. ఇతడిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, చీకటి పడడంతో వీలుకాలేదు. ఈ విషయం తెలిసిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాయి. వాగు వద్దకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంకయ్యను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.