మృత్యుంజయుడు.. మహాసంద్రంలో 14 గంటల పోరాటం

దిశ, ఫీచర్స్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 గంటలపాటు పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత శీతల జలాల్లో కొట్టుమిట్టాడిన ఓ నావికుడు ఎట్టకేలకు మృత్యువును జయించాడు. వివరాల్లోకెళితే.. న్యూజిలాండ్‌, పసిఫిక్ ఓషియన్‌లో ‘సిల్వర్ సపోర్టర్’ అనే కార్గో షిప్‌ వేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో 52 ఏళ్ల విడమ్ పెరెవర్టిలొవ్(నావికుడు) ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. షిప్ సిబ్బంది ఆ విషయాన్ని గుర్తించేలోపే షిప్ కొంత దూరం ముందుకెళ్లిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. బ్రిటిష్ హై కమిషనర్ […]

Update: 2021-02-28 03:26 GMT

దిశ, ఫీచర్స్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 గంటలపాటు పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత శీతల జలాల్లో కొట్టుమిట్టాడిన ఓ నావికుడు ఎట్టకేలకు మృత్యువును జయించాడు. వివరాల్లోకెళితే.. న్యూజిలాండ్‌, పసిఫిక్ ఓషియన్‌లో ‘సిల్వర్ సపోర్టర్’ అనే కార్గో షిప్‌ వేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో 52 ఏళ్ల విడమ్ పెరెవర్టిలొవ్(నావికుడు) ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. షిప్ సిబ్బంది ఆ విషయాన్ని గుర్తించేలోపే షిప్ కొంత దూరం ముందుకెళ్లిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. బ్రిటిష్ హై కమిషనర్ టు న్యూజిలాండ్, గవర్నర్ ఆఫ్ పిట్‌కాయిర్న్ ఐస్‌లాండ్స్ లారా క్లార్కెకు సమాచారమిచ్చారు. వెంటనే అతడిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించాలని ఆమె ఆదేశాలివ్వడంతో రక్షక దళాలు వెతకడం ప్రారంభించాయి.

కాగా తన ప్రాణాలు కాపాడుకునేందుకు పసిఫిక్‌లో స్విమ్మింగ్ చేస్తూ ముందుకు సాగిన విడమ్.. రబ్బర్ వలె ఉండి పేరుకుపోయిన సముద్ర చెత్తపై 14 గంటల పాటు తేలియాడుతూ ఉన్నాడు. రెస్క్యూ టీమ్ వచ్చి అతడిని రక్షించేవరకు అలానే ఉండి చావును ఓడించాడు. తాను మునిగిపోయానని, ఇక బతకనేమో అనుకున్నానని, కానీ ధైర్యంగా మళ్లీ ఈతకొట్టడం ప్రారంభించి చెత్తపై తేలుతూ సర్వైవ్ కాగలిగానని వెల్లడించాడు. కాగా అతడిని రక్షించేందుకు కృషి చేసిన రెస్క్యూ టీమ్‌ను గవర్నర్ లారా అభినందించారు.

Tags:    

Similar News