ఆమెకు నిప్పంటించాడు… అతనూ కాలిపోయాడు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని యువతిని కాల్చి చంపేశాడు. అదే నిప్పంటుకుని అతనూ మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. వివరాల్లోకి వెళితే… విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తాను పని చేస్తున్న హాస్పిటల్ కు సమీపంలోనే స్నేహితులతో కలిసి ఓ రూమ్ లో అద్దెకు నివసిస్తోంది. అయితే, గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన నాగభూషణం […]
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని యువతిని కాల్చి చంపేశాడు. అదే నిప్పంటుకుని అతనూ మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. వివరాల్లోకి వెళితే… విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తాను పని చేస్తున్న హాస్పిటల్ కు సమీపంలోనే స్నేహితులతో కలిసి ఓ రూమ్ లో అద్దెకు నివసిస్తోంది.
అయితే, గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన నాగభూషణం అనే యువకుడు ప్రేమించమంటూ చిన్నారి వెంటబడ్డాడు. ఆమె నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో నాగభూషణంపై చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపై వేధించను అని పోలీసుల ముందు నాగభూషణం అంగీకరించడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది.
అతని వేధింపులు ఉండవు అని భావించిన చిన్నారి నమ్మకం అగ్నికి ఆహుతయ్యింది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని వస్తున్న చిన్నారిని అడ్డగించి వాదనకు దిగాడు నాగభూషణం. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
కాగా ఆ మంటలు యువకుడికి కూడా అంటుకోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడవారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. కఠిన శిక్షలు కఠినాత్ములను కరిగించలేకపోతున్నాయి.