శుభకార్యంలో విషాదం.. ప్రాణం తీసిన మాంసం ముక్క
దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని మిడ్జిల్ మండలం లింభ్యాతండా పంచాయతీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన చంద్రు నాయక్(59) మంగళవారం రాత్రి 09:30 గంటలకు విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలాసేపు ఇబ్బందిపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పరీక్షించిన […]
దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని మిడ్జిల్ మండలం లింభ్యాతండా పంచాయతీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన చంద్రు నాయక్(59) మంగళవారం రాత్రి 09:30 గంటలకు విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలాసేపు ఇబ్బందిపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పరీక్షించిన వైద్యులు చంద్రు నాయక్ చనిపోయినట్లుగా తేల్చిచెప్పారు. చంద్రునాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.