సీసీ ఫుటేజి కావాలా నాయనా..జెస్ట్ 11 లక్షలే కట్టేసెయ్!
ఆర్టీఏ అప్లికేషన్‌కు అవాక్కయ్యే రిప్లయ్ వచ్చింది. బదులిచ్చింది మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి కమ్ కలెక్టర్. కొడాలి శ్రీనివాస్ అనే పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. కడపటి మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సీసీ ఫుటేజి కావాలని అడిగారు. 44 రోజుల వీడియో అభ్యర్థించారు. దీనికి మేడ్చల్ కలెక్టరేట్ స్పందించింది. సరేలే బాబూ! తప్పకుండా ఇస్తాం. దాంట్లో డౌటేమీ లేదు. బెంగేమీ వద్దు అన్నట్టుగా […]
ఆర్టీఏ అప్లికేషన్‌కు అవాక్కయ్యే రిప్లయ్ వచ్చింది. బదులిచ్చింది మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి కమ్ కలెక్టర్. కొడాలి శ్రీనివాస్ అనే పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. కడపటి మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సీసీ ఫుటేజి కావాలని అడిగారు. 44 రోజుల వీడియో అభ్యర్థించారు. దీనికి మేడ్చల్ కలెక్టరేట్ స్పందించింది. సరేలే బాబూ! తప్పకుండా ఇస్తాం. దాంట్లో డౌటేమీ లేదు. బెంగేమీ వద్దు అన్నట్టుగా పేర్కొంటూనే కండిషన్స్ అప్లయ్ అన్నది. ఆ షరతేమిటో తెలుసా! ఆ ఫార్టీ ఫోర్ డేస్ సీపీ ఫుటేజీ ఇవ్వాలంటే, 21,560 డీవీడీలు అవసరం. ఒక్కో డీవీడీకి రూ.50 చొప్పున టోటల్‌గా రూ.10.78 లక్షలు డిపాజిట్ చేయు నాయనా! అంటూ రాత పూర్వకంగా కబురు పంపింది. బాబోయ్..11 లక్షలే! అంటూ నోరెళ్లబెట్టడం అతని వంతవుతోంది. వీడియోల అంశంలో ఆర్టీఐ ‘ఖరీదైన’ ఐడియాలు వింటున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు!