పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత దంపతులు

దిశ, కొత్తగూడెం: నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఇడమ సురేందర్(23), మడకం సోనీ దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ఎస్పీ సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం సురేందర్ నిషేధిత సీపీఐ పార్టీలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇతను మావోయిస్టు పార్టీ కమిటీ మెంబర్ గాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజినల్ సెక్రటరీ ఆజాద్‌కు గార్డ్ గానూ పని చేశాడని తెలిపారు. మడకం సోనీ (23) ఎల్ఓఎస్ సభ్యునిగా పనిచేస్తున్న […]

Update: 2021-06-26 08:15 GMT

దిశ, కొత్తగూడెం: నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఇడమ సురేందర్(23), మడకం సోనీ దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సమక్షంలో లొంగిపోయారు. ఎస్పీ సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం సురేందర్ నిషేధిత సీపీఐ పార్టీలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇతను మావోయిస్టు పార్టీ కమిటీ మెంబర్ గాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజినల్ సెక్రటరీ ఆజాద్‌కు గార్డ్ గానూ పని చేశాడని తెలిపారు.

మడకం సోనీ (23) ఎల్ఓఎస్ సభ్యునిగా పనిచేస్తున్న ఆజాద్ కు గార్డుగా 2016 నుండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తుందని వీరిరువురు వివాహం చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం వేధింపులకు, ప్రస్తుత కరోనాకి భయపడి లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు.

Tags:    

Similar News