పోలీస్ స్టేషన్ సమీపంలో కీచక ముఠా.. 60 మంది బాలికలను ట్రాప్ చేసి..

దిశ, మహబూబ్ నగర్: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మైనర్  బాలికలపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. వారికి మాయమాటలు చెప్పి, ట్రాప్ చేసి లోబర్చుకుంటున్నారు. తాజాగా మైనర్  బాలికలను ట్రాప్ చేసి లోబర్చుకుంటున్న ఓ ముఠా దారుణాలు జడ్చర్లలో వెలుగు చూశాయి. వివరాలలోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఓ పంచాయతీ సెక్రటరీ, ఓ ప్రయివేట్ టీచర్, మరో నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఒక ముఠాగా మారి మైనర్  బాలికలపై కన్నేశారు. ఫోన్లు వాడే […]

Update: 2021-08-12 04:25 GMT

దిశ, మహబూబ్ నగర్: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మైనర్ బాలికలపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. వారికి మాయమాటలు చెప్పి, ట్రాప్ చేసి లోబర్చుకుంటున్నారు. తాజాగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి లోబర్చుకుంటున్న ఓ ముఠా దారుణాలు జడ్చర్లలో వెలుగు చూశాయి. వివరాలలోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఓ పంచాయతీ సెక్రటరీ, ఓ ప్రయివేట్ టీచర్, మరో నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఒక ముఠాగా మారి మైనర్ బాలికలపై కన్నేశారు. ఫోన్లు వాడే బాలికల నెంబర్లు తీసుకొని వారితో మాటలు కలుపుతారు. అనంతరం వారికి మాయమాటలు చెప్పి, ట్రాప్ లోకి దించుతారు. అలా బాలిక వారిని నమ్మిన తరువాత ఆమెను లొంగదీసుకుంటారు. ఇప్పటివరకు ఈ ముఠా 60మందికి పైగా బాలికలను ట్రాప్ చేసి, లొంగదీసుకున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ముఠా అడ్డా ఉండడం గమనార్హం.

ఇటీవల ఈ కీచక బ్యాచ్.. ఒక బాలికను ట్రాప్ చేయడానికి ప్రయత్నించగా ఆమె, కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కీచక బ్యాచ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. కొంతమంది రాజకీయ ప్రముఖులు ఈ కేసు ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కీచక బ్యాచ్ లో పలువురికి రాజకీయ నేతలతో పరిచయాలు ఉండటం వలన వారే పోలీసులను అడ్డుకుంటున్నట్లు వినికిడి.

Tags:    

Similar News