బ్రేకింగ్ : ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు సజీవదహనం
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర అహ్మద్‌నగర్ ఆసుపత్రిలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఐసీయూలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు సజీవదహనం కాగా, 10 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే.. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో […]
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర అహ్మద్‌నగర్ ఆసుపత్రిలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఐసీయూలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు సజీవదహనం కాగా, 10 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే.. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.