ప్రభుత్వ ఆఫీస్‌లోనే అలా చేస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా ఉద్యోగి
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు అంటే క్రమశిక్షణకు మారుపేరు. అందులో మహిళా ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. కానీ, ఓ మహిళా ఉద్యోగి ఇతర ఉద్యోగులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. విజిలెన్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ లోని కొరాపుట్ జిల్లా సిమిలిగుడ రెవెన్యూ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఖిరాది తన్నయ్య అనే మహిళా రెవెన్యూ ఉద్యోగి పట్టుపడింది. జయరాం పంగి […]
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు అంటే క్రమశిక్షణకు మారుపేరు. అందులో మహిళా ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. కానీ, ఓ మహిళా ఉద్యోగి ఇతర ఉద్యోగులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. విజిలెన్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ లోని కొరాపుట్ జిల్లా సిమిలిగుడ రెవెన్యూ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఖిరాది తన్నయ్య అనే మహిళా రెవెన్యూ ఉద్యోగి పట్టుపడింది. జయరాం పంగి అనే వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదేవిధంగా ఆమెకు సంబంధించి ఆస్తులపైన కూడా విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆమెను విజిలెన్స్ ఆఫీస్ కు తరలించి విచారణ చేస్తున్నారు.