అయ్యో ఎంత కష్టం.. కూతురును అమ్మేసిన తండ్రి.. అలా చేయొద్దని కన్నీరు..
దిశ, వెబ్ డెస్క్ : తాలిబాన్ల అరాచక పాలన ఇప్పుడు అఫ్గన్ ల పాలిట శాపంగా మారింది. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరగడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. కుటుంబాలను పోషించుకోవడానికి కుటుంబ పెద్దలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఇళ్లు వాకిళ్లే కాదు ఇప్పుడు ఏకంగా పిల్లలను అమ్ముకునే దారుణమైన పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితే బాద్గిస్ ప్రావిన్స్ లోని శరణార్ధి శిబిరం లో తల దాచుకుంటున్న అబ్దుల్ మాలిక్ […]
దిశ, వెబ్ డెస్క్ : తాలిబాన్ల అరాచక పాలన ఇప్పుడు అఫ్గన్ ల పాలిట శాపంగా మారింది. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరగడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. కుటుంబాలను పోషించుకోవడానికి కుటుంబ పెద్దలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఇళ్లు వాకిళ్లే కాదు ఇప్పుడు ఏకంగా పిల్లలను అమ్ముకునే దారుణమైన పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితే బాద్గిస్ ప్రావిన్స్ లోని శరణార్ధి శిబిరం లో తల దాచుకుంటున్న అబ్దుల్ మాలిక్ కు వచ్చింది. తన కుటుంబంలో మొత్తం తొమ్మిది మందికి పట్టెడన్నం పెట్టడానికి తన కూతురునే బలి పశువును చేశాడు.
దీపావళి వేళ మరోసారి వార్తల్లో నిలిచిన Samantha.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
follow Facebook Page Viral news : https://bit.ly/3wcKaXw
తొమ్మిదేళ్ల ఫర్వానా మాలిక్ అనే బాలిక ను 55 ఏళ్ల వృద్దునికి అమ్మేశాడు. వచ్చిన ఆ కాస్త సొమ్ముతో కుటుంబాన్ని లాక్కొద్దాం అనుకున్నాడు. అయితే చిన్న పిల్లనైన తనను కొడతాడేమోనని ఆ 55 ఏళ్ల వృద్దుని దగ్గరకు వెళ్లనూ అంటూ ఏడుస్తున్న తీరును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన కూతురు తప్పు చేస్తే కొట్టవద్దని, తనను జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్న తండ్రిని చూసి చుట్టుపక్కన ఉన్న వాళ్ల గుండెలు తరుక్కు పోయాయి. కుటుంబ పోషణకు తనకు ఇంతకు మించి వేరొక మార్గం కనపడలేదని అబ్దుల్ మాలిక్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి హృదయ విదారక పరిస్థితులు ఏన్నో ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో కనిపిస్తున్నాయి.