ధాన్యం కొనుగోలు చేయండి సార్.. ఎస్ఐ కాలు మొక్కిన రైతు
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రబీలో సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం పాలెపల్లి వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం రోడ్డుపై పోసి తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని ఓ రైతు.. […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రబీలో సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం పాలెపల్లి వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం రోడ్డుపై పోసి తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని ఓ రైతు.. అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ కాళ్లు మొక్కి ప్రాధేయపడ్డారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయితే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.