ఐఏఎస్ అధికారినంటూ టోపీ..రూ. కోటి తో జంప్.. చివరికి..!

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆదిత్య ఎన్క్లేవ్ లోని ఓ అపార్ట్ మెంట్లో రూమ్ ని అద్దెకు తీసుకొని ఐఎఎస్ అధికారినంటూ నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా బాధితుడు సంతోష్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా భీంపూర్ మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి నారాయణ (22) అనే వ్యక్తి తాను ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యానని, ఐఏఎస్ ఉద్యోగం వస్తుందని నమ్మబలికి 36 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి […]

Update: 2021-04-12 11:24 GMT

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆదిత్య ఎన్క్లేవ్ లోని ఓ అపార్ట్ మెంట్లో రూమ్ ని అద్దెకు తీసుకొని ఐఎఎస్ అధికారినంటూ నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా బాధితుడు సంతోష్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా భీంపూర్ మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి నారాయణ (22) అనే వ్యక్తి తాను ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యానని, ఐఏఎస్ ఉద్యోగం వస్తుందని నమ్మబలికి 36 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షలు చొప్పున వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఐఏఎస్ అధికారి చేతిలో నష్టపోయిన వాళ్ళందరూ జగిత్యాల జిల్లాకు చెందినవారేనని తెలిసింది. పోలీసులు నకిలీ ఐఏఎస్ అధికారి కార్యాలయానికి చేరుకొని సోదాలు చేయగా, పలు డాక్యుమెంట్లను ఒక కారును సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News