మొక్కడానికొస్తున్నారా.. నొక్కెయ్యడానికా?
దిశ, నల్గొండ: యాదాద్రి కొండపైన నిఘా వైఫల్యం పెరుగుతుంది. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో నిత్యం భక్తుల సామాగ్రి చోరీకి గురవుతున్నాయి. కాగా, సోమవారం గుట్టపైన కోనేరుకు ఆనుకోని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగివచ్చేలోపే ఓ భక్తుడి ఫోన్ చోరీకి గురైంది. దీంతో గుడికి మొక్కడానికి వస్తున్నారా.. నొక్కెయ్యడానికి వస్తున్నారా అంటూ ఆ భక్తుడు వాపోయాడు. మరో రెండు రోజుల్లో కళ్యాణోత్సవం, రథోత్సవం ఉన్నందున భక్తుల రద్దీ మరింత పెరగనుంది. దీంతో దొంగలు మరింత […]
దిశ, నల్గొండ: యాదాద్రి కొండపైన నిఘా వైఫల్యం పెరుగుతుంది. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో నిత్యం భక్తుల సామాగ్రి చోరీకి గురవుతున్నాయి. కాగా, సోమవారం గుట్టపైన కోనేరుకు ఆనుకోని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగివచ్చేలోపే ఓ భక్తుడి ఫోన్ చోరీకి గురైంది. దీంతో గుడికి మొక్కడానికి వస్తున్నారా.. నొక్కెయ్యడానికి వస్తున్నారా అంటూ ఆ భక్తుడు వాపోయాడు. మరో రెండు రోజుల్లో కళ్యాణోత్సవం, రథోత్సవం ఉన్నందున భక్తుల రద్దీ మరింత పెరగనుంది. దీంతో దొంగలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు
tag: devotees, phone theft, yadagirigutta