ఎర్రకోట అల్లర్ల కేసులో నటుడు దీప్ సిద్దుకు ఊరట

న్యూఢిల్లీ: ఎర్రకోట అల్లర్ల కేసులో నటుడు దీప్ సిద్దుకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో నటుడు దీప్ సిద్ధుకు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఇద్దరు స్థానికుల షూరిటీతో కూడిన వ్యక్తిగత బాండ్‌ను సమర్పించాలని సిద్దును కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టును కూడా విచారణ అధికారి వద్ద డిపాజిట్ చేయాలని, ప్రతి నెలా […]

Update: 2021-04-17 01:40 GMT

న్యూఢిల్లీ: ఎర్రకోట అల్లర్ల కేసులో నటుడు దీప్ సిద్దుకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో నటుడు దీప్ సిద్ధుకు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఇద్దరు స్థానికుల షూరిటీతో కూడిన వ్యక్తిగత బాండ్‌ను సమర్పించాలని సిద్దును కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టును కూడా విచారణ అధికారి వద్ద డిపాజిట్ చేయాలని, ప్రతి నెలా మొదటి, 15వ రోజు ఆయన ఏ లొకేషన్‌లో ఉన్నాడన్న విషయాన్ని విచారణ అధికారికి ఫోన్ ద్వారా అందించాలని తెలిపింది.

కాగా ఉదయం ఈ కేసులో విచారణ జరిగింది. హింస జరిగిన సమయంలో ఎర్రకోట దగ్గర ఉన్నంత మాత్రాన సిద్దు ఈ కుట్రలో పాలు పంచుకున్నట్టు కాదనీ..ఆయన నిజమైన భారతీయుడుగా రైతుల నిరసనలకు మద్దతు తెలిపేందుకు మాత్రమే వచ్చాడని వాదించారు. దీన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. కేవలం హింసను రేకెత్తించాలన్న ఉద్దేశ్యంతోనే సిద్దు ఎర్రకోటకు వచ్చారనీ.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే బయటకు వచ్చి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సిద్దుకు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News