చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్.. షాక్‌లో కుంటుంబం..
దిశ, కుక్కునూరు : కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి కనిపెట్టిన వ్యాక్సిన్ వేయడంలో వింత చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ఈ సంఘటన బుధవారం కుక్కునూరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెరచర్ల గ్రామానికి చెందిన పిన్నబోయిన. సురేష్ (28) ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి పేరిట మొదటి డోస్ […]
దిశ, కుక్కునూరు : కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి కనిపెట్టిన వ్యాక్సిన్ వేయడంలో వింత చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ఈ సంఘటన బుధవారం కుక్కునూరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెరచర్ల గ్రామానికి చెందిన పిన్నబోయిన. సురేష్ (28) ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి పేరిట మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఈ నెల 11న ఫోన్ కి మెసేజ్ వచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. చనిపోయిన తన కుమారుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న విషయం మమ్మల్ని గందరగోళానికి గురిచేసిందని మొర పెట్టుకున్నారు. కాగా కుక్కునూరు మండలంలో ఈ సంఘటన వైరల్‌గా మారింది. సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా ? టెక్నికల్ లోపమా ? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా అమరవరం వైద్యాధికారి సునీల్ వర్మను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా.. టెక్నికల్ పొరపాటు జరిగి ఉండవచ్చునని తెలిపారు.