105 దేశాలకు కోవిడ్-19
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం 105 దేశాలకు పాకింది. మంగళవారం ఒక్కరోజే ఇరాన్‌లో దాదాపు 54మంది ఈ వైరస్‌తో మృతిచెందారు. దీంతో పలు దేశాలు ఇటలీకి విమాన సర్వీసులు నిలిపివేశాయి. పర్యాటకం ఎక్కువగా ఉన్న దేశాల్లో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చైనా దేశం ఆర్థికంగా కుదేలవడంతోపాటు, ప్రపంచ దేశాల మార్కెట్లనూ ఈ వైరస్ కుంగదీస్తోంది. కాగా భారతదేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 60కి చేరాయి. కొత్తగా కేరళలో 8, కర్నాటకలో 4, […]
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం 105 దేశాలకు పాకింది. మంగళవారం ఒక్కరోజే ఇరాన్‌లో దాదాపు 54మంది ఈ వైరస్‌తో మృతిచెందారు. దీంతో పలు దేశాలు ఇటలీకి విమాన సర్వీసులు నిలిపివేశాయి. పర్యాటకం ఎక్కువగా ఉన్న దేశాల్లో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చైనా దేశం ఆర్థికంగా కుదేలవడంతోపాటు, ప్రపంచ దేశాల మార్కెట్లనూ ఈ వైరస్ కుంగదీస్తోంది. కాగా భారతదేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 60కి చేరాయి. కొత్తగా కేరళలో 8, కర్నాటకలో 4, మహారాష్ర్టలో 2 కేసులు నమోదు అయ్యాయి. కాగా ఈ వైరస్ పుట్టిన చైనా దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి.
tags : coronavirus, infected, 105 countries, china, iran, kerala, mumbai, karnataka, Positive Cases 60 in india