విద్యుత్ అధికారులకు కరోనా షాక్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులకు కరోనా వైరస్ షాకిచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని విద్యుత్ శాఖలో పనిచేసే ముగ్గురు అధికారులకు సోమవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జిల్లాలోని విద్యుత్ ప్రగతి భవన్ కు సైతం కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. పవర్ హౌజ్ కంపౌండ్‌లోని డీఈకి, అతడి కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగికి కరోనా సోకింది. డీఈతో కలిసి ప్రయాణం చేసిన నిజామాబాద్ రూరల్‌లో పనిచేసే సబ్ ఇంజినీర్‌కు సైతం పాజిటివ్ అని […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులకు కరోనా వైరస్ షాకిచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని విద్యుత్ శాఖలో పనిచేసే ముగ్గురు అధికారులకు సోమవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జిల్లాలోని విద్యుత్ ప్రగతి భవన్ కు సైతం కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. పవర్ హౌజ్ కంపౌండ్‌లోని డీఈకి, అతడి కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగికి కరోనా సోకింది. డీఈతో కలిసి ప్రయాణం చేసిన నిజామాబాద్ రూరల్‌లో పనిచేసే సబ్ ఇంజినీర్‌కు సైతం పాజిటివ్ అని తెలుస్తోంది. విద్యుత్ శాఖలో కరోనా కలకలం రేపడంతో సంబంధిత అధికారితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారందరికీ పరీక్షలు చేసేందుకు సిద్ధమౌతున్నారు.
ఇప్పటికే కార్యాయలం మొత్తం శానిటైజేషన్ చేశారు. ఇదివరకు లాగా ప్రగతి భవన్‌లో నేరుగా ఎవ్వరినీ అనుమతించడం లేదు. డీఈ, ఓఉద్యోగితో పాటు సబ్ ఇంజినీర్ లను ప్రాథమికంగా వారు భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
మున్సిపల్ కార్పోరేషన్‌లో మరోకరికి….
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరోకరికి కరోనా సోకింది. మేయర్ దండు నీతూ కిరణ్‌కు ఇదివరకే కరోనా నిర్దారణ కాగా, కార్యాలయంలో పెన్షన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి పాజిటివ్ అని తేలింది. ఇదివరకు మున్సిపల్ కార్పోరేషన్ లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న పీహెచ్ వర్కర్ కు, రెవిన్యూ విభాగంలో ఓ బిల్ కలెక్టర్ కు, టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీబీఓకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మేయర్‌కు కరోనా సోకిన తరువాత దాని ప్రభావం కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది.పెన్షన్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకడంతో ఇటీవల అతడిని కలిసిన పింఛన్ దారులు, సహచర ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు.