మరో పదిహేను రోజులు అక్కడ.. స్వచ్ఛంద లాక్ డౌన్
దిశ, దుబ్బాక: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న స్వచ్ఛంద లాక్‌డౌన్ నిర్ణయాన్ని మరికొంత కాలం పొడిగింపు చేయనున్నట్టు దుబ్బాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చింత రాజు గుప్తా అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆగస్ట్ 01 నుంచి 15 వరకు ఈ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్టుగా తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలవరకు మాత్రమే తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని, అలాగే ప్రజలు, వినియోగదారులు […]
దిశ, దుబ్బాక: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న స్వచ్ఛంద లాక్‌డౌన్ నిర్ణయాన్ని మరికొంత కాలం పొడిగింపు చేయనున్నట్టు దుబ్బాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చింత రాజు గుప్తా అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆగస్ట్ 01 నుంచి 15 వరకు ఈ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్టుగా తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలవరకు మాత్రమే తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని, అలాగే ప్రజలు, వినియోగదారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారాంతపు సంతలైన శనివారం కూరగాయల అంగడి, గొర్ల అంగడి ఆగస్టు15 వరకు పూర్తిగా నిలిపివేయడం జరిగిందని చెప్పారు.