కరోనా రక్షణకు కుమారునికి ప్రత్యేక సూట్ రూపొందించిన తండ్రి

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ ను కట్టడి చేయాలంటే… ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలి. బయటకు వస్తే తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అంతేకాదు విధిగా మాస్క్ ధరించాలి. వీటిని పాటిస్తూ.. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అందుకే .. ఈ మహమ్మారి బారి నుంచి తన కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి వినూత్న ప్రయత్నం చేశాడు. కరోనా నుంచి రక్షించేందుకు ఓ ప్రత్యేకమైన సూట్‌ను తయారు చేసి తన కొడుకుకు తొడిగాడు. […]

Update: 2020-04-15 05:38 GMT

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ ను కట్టడి చేయాలంటే… ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలి. బయటకు వస్తే తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అంతేకాదు విధిగా మాస్క్ ధరించాలి. వీటిని పాటిస్తూ.. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అందుకే .. ఈ మహమ్మారి బారి నుంచి తన కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి వినూత్న ప్రయత్నం చేశాడు. కరోనా నుంచి రక్షించేందుకు ఓ ప్రత్యేకమైన సూట్‌ను తయారు చేసి తన కొడుకుకు తొడిగాడు. దాంతో ఆ చిన్నోడు వీధుల్లో స్వేచ్ఛగా ఆడుతూ.. తిరుగుతున్నాడు. ఆ చిన్నోడి వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. ఆ తండ్రి ఆలోచనకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ప్రశంసిస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయటకు వచ్చినా.. భయం భయంగానే ఉంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కావో జుంజీ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని కరోనావైరస్‌ నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేకమైన సూట్‌ను సృష్టించాడు. ఆ సూట్‌ చూడటానికి అచ్చం స్పేస్ సూట్ ను పోలి ఉండి. ఆ సూట్ లో ఎయిర్ రిఫ్రెషర్ పరికరంతో పాటు, గాలి కోసం ఒక ఎలక్ట్రానిక్‌ ఫ్యాన్‌ను కూడా దాంట్లో ఏర్పాటు చేశాడు.ఇక ఎలాంటి మాస్కులు, శానిటైజర్లు వాడకుండా నిర్భయంగా తమ కుమారుడిని బయటకు తీసుకెళ్తున్నామని, మాస్కు కంటే సూట్ ఇంకా ఉత్తమమని కావో పేర్కొన్నారు. ‘చిన్న పిల్లల ముఖానికి మాస్కులు వేస్తే ఉంచుకోలేరు. అంతేకాదు చిన్నపిల్లలు చేతులు తరుచుగా ఆడిస్తారు. ఎంత వద్దని చెబుతున్న చేతులతో ముఖాలను తరచూ తాకుతుంటారు. ఈ సూట్ తో ఆ బాధలు ఉండవు. మాస్కులకు ప్రత్యామ్నాయంగా ఈ సూట్‌ను డిజైన్‌ చేశాను’ అని కావో వివరించారు.

Tags : corona virus, chaina, special suit, child, father

Tags:    

Similar News