ఓ కారులో మంటలు.. అటుగా వెళ్తున్న గవర్నర్ తమిళసై స్పందించి..
దిశ రాజేంద్రనగర్ : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పై చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి నుండి శైలజా తన ముగ్గురు పిల్లతో కలిసి బంజారాహిల్స్ కు ఆస్పత్రికి వెళుతుండగా, అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 135 వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న నలుగురు కుటుంబసభ్యులను […]
దిశ రాజేంద్రనగర్ : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పై చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి నుండి శైలజా తన ముగ్గురు పిల్లతో కలిసి బంజారాహిల్స్ కు ఆస్పత్రికి వెళుతుండగా, అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 135 వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
దీంతో మంటల్లో చిక్కుకున్న నలుగురు కుటుంబసభ్యులను అటుగా వెళుతున్న రవి అనే యువకుడు చూసి ప్రాణాలను లెక్కచేయకుండా కారులో నుండి నలుగురిని ప్రాణాలతో బయటకు తీశాడు. అదే క్రమంలో మహేశ్వరం నుండి హైదరాబాద్ వెళుతున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్రాఫిక్ పోలీసులను, ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపి మంటలను పూర్తిగా ఆర్పివేయించారు. ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడిన రవి అనే యువకుడిని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రశంసించారు.