ఆ జర్నలిస్టును చంపింది పోలీసులేనా?

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో యువ జర్నలిస్టు అనుమానాస్పద మృతి కేసు సంచలనం రేపుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది. యూపీలో ఒక హిందీ పత్రికలో విధులు నిర్వహించే సూరజ్‌ ఉన్నావో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ, శుక్రవారం రోజు రైల్వే పట్టాల పై శవమై తేలాడు. అయితే, అంతకుముందు తమ కొడుకు సూరజ్‌కు సబ్ […]

Update: 2020-11-13 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో యువ జర్నలిస్టు అనుమానాస్పద మృతి కేసు సంచలనం రేపుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది. యూపీలో ఒక హిందీ పత్రికలో విధులు నిర్వహించే సూరజ్‌ ఉన్నావో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ, శుక్రవారం రోజు రైల్వే పట్టాల పై శవమై తేలాడు.

అయితే, అంతకుముందు తమ కొడుకు సూరజ్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ సునీతా చౌరాసియా, కానిస్టేబుల్ అమర్ సింగ్, మరో వ్యక్తి కలిసి బెదిరింపులు చేశారని బాధితులు నగర సర్కిల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కానిస్టేబుల్ ఈ నెల 11న సూరజ్‌కు ఫోన్ చేసి బెదిరించడాని.. ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కొడుకు ఎంతకీ తిరిగి రాలేదని తల్లి వాపోయింది. చివరకు ఇలా విగతాజీవిగా కనిపించడాని కన్నీళ్లు పెట్టుకుంది. తమ కొడుకును ఆ పోలీసులే హత్య చేసి రైల్వే పట్టాల పై పడేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News