కాంగ్రెస్‌లో వర్క్ డివిజన్.. ఉత్తమ్, కోమటిరెడ్డి సహా కీలక నేతలకు బిగ్ టాస్క్!
కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ యాక్టివిటీస్‌ను విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లాని ప్లాన్ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ యాక్టివిటీస్‌ను విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లాని ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా హై కమాండ్ సూచన మేరకు వర్క్ డివిజన్చేసింది. కో ఆర్డినేషన్ కోసం కమిటీలు వేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్‌కు సేవాదళ్, ఐఎన్టీయూసీ, ఇతర యూనియన్సంఘాలు, మాజీ మంత్రి గీతారెడ్డికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, పార్టీ సీనియర్‌నేత మద్దుల గాల్రెడ్డికి ఎన్ఆర్ఐ, ఇండియన్ఓవర్సీస్యాక్టివిటీస్, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సంపత్ కుమార్, జాగ్గారెడ్డి, రేణుకా చౌదరి, శ్రీధర్‌లు బాబులకు చేరికలు టాస్క్‌లు అప్పగించారు. ఇప్పటికే ఆయా నేతలకు పర్సనల్‌గా డీకే నుంచి సమాచారం అందినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
జిల్లాల వారీగా టీమ్‌లు..
రాష్ట్ర స్థాయిలోని ఈ నేతలు జిల్లాకో కమిటీని వేయనున్నారు. ఈ వారంలోనే ఈ కమిటీలు ఏర్పాటు పూర్తి కానున్నది. ఈ నెలాఖరు వరకు ఆయా నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ యాక్టివిటీస్‌ను ప్రచారం చేయడమే కాకుండా, చేరికల మీద ఫోకస్ పెట్టనున్నారు. పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న లీడర్లు, ఇతర పార్టీలోకి అసంతృప్తి నేతల జాబితాను కూడా తయారు చేసేపనిలో టీపీసీసీ నిమగ్నమైంది. వాళ్లతో చేరికల కమిటీ నేతలు నేరుగా చర్చలు జరపనున్నారు. భరోసా ఇచ్చేందుకు డీకేతోనూ మాట్లాడించే ప్రయత్నం చేయనున్నట్లు ఓ నేత తెలిపారు.
70 సీట్లు గెలిచేలా...?
కాంగ్రెస్‌పార్టీ ఇప్పటి వరకు మూడు సర్వేలు చేసింది. వీటిలో ఒకటి ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ చేయగా, రెండు పార్టీ సొంతంగా నిర్వహించింది. ఈ మూడింటిలోనూ కాంగ్రెస్సగటును 70 సీట్లు గెలుస్తుందని నివేదికల్లో వచ్చాయని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే చెప్పారు. అయితే ఈ 70 సీట్లను ఫిక్స్చేసి ‘చే’ జారకుండా చూడాలని టీపీసీసీకి డీకే సూచించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలందరినీ ఈ నెలాఖరు నుంచి పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ప్రణాళిక వేసింది. ఓవరల్టాస్క్ను ఎంపీలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించనున్నారు.