తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. సర్వేలన్నీ తమకే అనుకూలం: రాహుల్

ఎన్ఆర్ఐలకు మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. అమెరికాలోని న్యూయర్క్‌ జాకబ్స్​జావిట్స్‌లో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.

Update: 2023-06-05 15:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్ఆర్ఐలకు మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. అమెరికాలోని న్యూయర్క్‌ జాకబ్స్​జావిట్స్‌లో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... కాంగ్రెస్​అధికారంలోకి రాగానే సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. ఇండస్ట్రీలు, కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా ప్రణాళికను తయారు చేస్తామన్నారు. తెలంగాణలో ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలమని చెబుతున్నాయన్నారు. ప్రజా నాడిని కూడా తాము పసిగట్టామని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజా సంక్షేమం పరుగులుపెట్టాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైస్​ప్రెసిడెంట్ చామల కిరణ్​కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News