IPL 2025 : బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా?.. ఆ మ్యాచ్‌లకు దూరమేనా?
మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న టీమిండియా, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా టోర్నీలో పాల్గొంటాడా?లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతను బౌలింగ్ చేస్తున్నా.. ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. దీంతో బుమ్రా ఐపీఎల్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు?.. ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 23న ముంబై తొలి మ్యాచ్‌లో చెన్నయ్‌తో తలపడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ముంబై తమ తొలి హోం గ్రౌండ్ మ్యాచ్‌ను ఈ నెల 31న కోల్‌కతాతో ఆడనుంది. ఆ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండే చాన్స్ ఉందని సదరు మీడియా సంస్థ తెలిపింది. ఈ నెలాఖరులో బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా ఫిట్‌నెస్‌పై ఐపీఎల్‌గానీ, ముంబై ఫ్రాంచైజీగానీ అధికారికంగా ప్రకటిస్తేనే ఓ స్పష్టత రానుంది.