టార్గెట్ తక్కువే.. ఈజీగా కొట్టేస్తారా?.. పీకలదాకా తెచ్చుకుంటారా..?

ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానం(Dubai International Cricket Stadium) వేదికగా జరుగుతోన్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) బ్యాటర్లు నిలకడగా రాణించారు.

Update: 2025-03-04 12:44 GMT
టార్గెట్ తక్కువే.. ఈజీగా కొట్టేస్తారా?.. పీకలదాకా తెచ్చుకుంటారా..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానం(Dubai International Cricket Stadium) వేదికగా జరుగుతోన్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) బ్యాటర్లు నిలకడగా రాణించారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌ కావడంతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా భారత్(Team India) ఎదుట గౌరవప్రదమైన టార్గెట్ పెట్టారు. 49.3 ఓటర్లలో 10 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేశారు. భారత్(India) విజయం సాధించాలంటే 265 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్(39), స్టీవ్ స్మిత్(73), లబుషేన్(29), కారీ(61) రాణించారు. కీలక బ్యాట్‌మెన్‌లు స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, వరుణ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, హర్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

Tags:    

Similar News