లూపస్ వ్యాధితో యువతి మృతి..
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యువతి లూపస్ వ్యాధితో మృతి చెందింది.
దిశ, రామగిరి : రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యువతి లూపస్ వ్యాధితో మృతి చెందింది. కల్వచర్లకు చెందిన కట్ట సత్యనారాయణ కూతురు సాహితి లూపస్ వ్యాధితో బాధపడుతుండడంతో 6 నెలలుగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22న హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.