విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గడ్, బోలాడ బజార్ జిల్లా, పిసిడ్ గ్రామినికి చెందిన తేజ్‌నాథ్ పటేల్(26), తన భార్య సోమవారిన్ పటేల్‌తో కలిసి నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద మేస్త్రీ రామ్మూర్తితో కలిసి నిర్మాణ పనులకు వెళ్లిన తేజ్‌నాథ్ అక్కడ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
దీంతో రామ్మూర్తితో పాటు అక్కడ పని చేస్తున్న వారు తేజ్నాథ్ను హుటా హుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తేజ్నాథ్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో రామ్మూర్తి తేజ్‌నాథ్ భార్య సోమవారిన్ పటేల్‌కు సమాచారం అందించాడు. సంఘటన సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్మాణదారుడు
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, నిర్మాణంలో భవనం వద్ద విద్యుత్ తీగలు ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపడుతుండటంతో తేజ్‌నాథ్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని, నిర్మాణ దారుడిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సోమవారిన్ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.