భర్త పనికి వెళ్లగా భార్య బలవన్మరణం
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వరండాలో చున్నీతో ఉరి వేసుకుని మహిళ నున్న కస్తూరి(28) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని కమలాపురం గోదావరి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
దిశ, మంగపేట : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వరండాలో చున్నీతో ఉరి వేసుకుని మహిళ నున్న కస్తూరి(28) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని కమలాపురం గోదావరి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నున్ననాగేశ్వరరావు తన భార్య కస్తూరి ఇద్దరు పిల్లలతో గోదావరి రోడ్డులో నివాసముంటూ సెట్రింగ్ పనులు చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం నాగేశ్వరరావు పనికి వెళ్లగా పిల్లలను స్కూలుకు పంపిన కస్తూరి ఇంటి వరండాలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం కస్తూరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.