దారుణం..భార్య అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భర్త ఏం చేశాడంటే?

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అందంగా తయారవుతున్న భార్యను చూసి ఆమె భర్త ఓర్చుకోలేకపోయాడు.

Update: 2024-08-15 09:22 GMT

దిశ,వెబ్‌డెస్క్:కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అందంగా తయారవుతున్న భార్యను చూసి ఆమె భర్త ఓర్చుకోలేకపోయాడు. ఆమె పై అనుమానాలతో రగిలిపోయేవాడు. చివరకు ఆమెను హత్యచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దివ్య(32), ఉమేష్ భార్యభర్తలు మధ్య గొడువలు మొదలయ్యాయి. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ పెదవులకు లిప్స్‌స్టిక్ వేసుకొని, ఒంటిపై టాటూ కూడా వేయించుకుంది. భార్య ఇలా ప్రవర్తించడం అతనికి నచ్చలేదు. అనుమానలతో చాలా సార్లు వారిద్దరి మధ్య గొడువలు జరిగేవి. ఈ క్రమంలో భర్త తనను అనుమానిస్తూ..వేధిస్తున్నడాని సహించలేక పోయిన ఆమె విడాకులకు అప్లై చేసుకుంది.

ఈ విషయానికై మంగళవారం భార్యభర్తలిద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను మారిపోయానని, ఇక నుంచి ఎటువంటి గొడువలు పెట్టను అని భార్యను నమ్మించాడు. భర్త మాటలు నమ్మిన దివ్య..ఉమేష్ వెంట వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఊజగల్లు దేవాలయానికి తీసుకెళ్లిన ఉమేశ్ దర్శనం అనంతరం సమీపంలోని కొండ వద్దకు తీసుకెళ్లాడు. అతని ప్లాన్‌లో భాగంగా అప్పటికే అక్కడ నలుగురు స్నేహితులను ఉంచారు. అక్కడే వారితో కలిసి దివ్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ క్రమంలో వారు పరారైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన ఉమేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Tags:    

Similar News