ఇద్దరు ఈడీ అధికారులు అరెస్ట్
రాజస్థాన్‌లో లంచం తీసుకున్న ఇద్దరు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. చిట్ ఫండ్ కేసు వ్యవహారంలో ఇద్దరు అధికారులు లంచం తీసుకునే క్రమంలో రెడ్ వ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లో లంచం తీసుకున్న ఇద్దరు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. చిట్ ఫండ్ కేసు వ్యవహారంలో ఇద్దరు అధికారులు లంచం తీసుకునే క్రమంలో రెడ్ వ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెలితే.. చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఈడీ అధికారులైన నావల్ కిషోర్ మీనా, బాబూలాల్ మీనా రూ. 15 లక్షలు అడిగారు.
ఈడీ ఇన్‌స్పెక్టర్లు ఒక మధ్యవర్తి వ్యక్తి నుంచి ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ ట్రాప్ చేసి అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరు ఈడీ అధికారుల నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను అక్టోబర్ 30న ఈడీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన కుమారుడిని ఈడీ ప్రశ్నించడం రాజకీయ కుట్ర అని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.