ఈజీగా సంపాదించారు.. ఈజీగా దొరికిపోయారు!
హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల నగదు, ఒక బైక్, రెండు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల నగదు, ఒక బైక్, రెండు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్డీసీపీ నితికా పంత్తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌కు చెందిన చంద్రశేఖర్(అలియాస్వినయ్(34)) ఉప్పల్ఐడీఏ ప్రాంతంలోని షెపర్పేపర్ప్రైవేట్లిమిటెడ్లో మేనేజింగ్పార్ట్నర్. ఇదే సంస్థలో ప్రభాకర్(42) ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్‌కు కొందరు హవాలా ఏజెంట్లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను చంద్రశేఖర్తన వద్ద పని చేస్తున్న ప్రభాకర్‌తో కలిసి కొంతకాలంగా హవాలా దందా నడిపిస్తున్నాడు.
గురువారం రాత్రి బేగంబజార్ప్రాంతంలోని ఓ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని షా ఇనాయత్గంజ్స్టేషన్పరిధిలో ఉంటున్న మరో వ్యక్తికి డెలివరీ ఇవ్వటానికి ఇద్దరూ కలిసి బైక్‌పై బయల్దేరారు. కాగా, ఎన్నికల విధుల్లో భాగంగా గోషామహల్స్టేడియం వద్ద తనిఖీలు చేస్తున్న సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్సీఐ రాజూ నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి ఈ ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించక పోవటంతో వారిని క్షుణ్ణంగా విచారించారు. ఈ క్రమంలో దొరికింది హవాలా డబ్బు అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం షా ఇనాయత్గంజ్పోలీసులకు అప్పగించారు.