crime : వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో విషాదం
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
దిశ, వేములవాడ : వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతూ గ్రామానికి చెందిన పెండ్యాల చంద్రకాంత్ (55) అనే గల్ఫ్ కార్మికుడు ఆబ్ దాబి(దుబాయ్) లోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29న మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా 1992 నుండి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్ అకాల మరణం చెందటం పట్ల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య లావణ్య (42), కుమారుడు సాయి తేజ (20) కూతురు హాసిని(17)లు ఉన్నారు. ఈనెల 2వ తేదీన మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం.