కరుడుగట్టిన దొంగల అరెస్ట్..

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు వివిధ మండలాల్లోని గుళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కరుడుగట్టిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2024-07-11 16:54 GMT

దిశ, భీంగల్ : నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు వివిధ మండలాల్లోని గుళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కరుడుగట్టిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండకు చెందిన బట్టు సతీష్, ఆర్మూర్ కు చెందిన చిట్యాల రాజు, రూపేష్ లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. వీరిని పట్టుకునేందుకు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, భీంగల్ ఇంచార్జి ఎస్సై రాజశేఖర్, ఏఎస్సై చిరంజీవితో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం భీంగల్ నందిగల్లీ పోచమ్మ ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా బట్టు సతీష్, చిట్యాల రాజులు కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా గుడుల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీస్ ల విచారణలో ఒప్పుకున్నారు.

వీరి ముఠాలోని సభ్యుడు రూపేష్ పరారిలో ఉన్నట్టు రూపేష్ ను పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సీఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుండి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో వీరిరువురు పలు గుళ్ళల్లో దొంగతనాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి కరుడుగట్టిన దొంగలను పట్టుకొనడంలో చాకచక్యం వహించిన పోలీస్ టీంను ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు.


Similar News