వ్యక్తికి 707 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా..?

తప్పు చేసి మనిషి శిక్ష అనుభవించక తప్పదు.

Update: 2023-11-20 14:24 GMT
వ్యక్తికి 707 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తప్పు చేసి మనిషి శిక్ష అనుభవించక తప్పదు. అయితే.. వాళ్లు చేసిన తప్పును బట్టి మూడేళ్ల, ఏడేళ్లు లేక యావజీవకారగార శిక్ష అనేది విధిస్తుంది న్యాయ శాస్త్రం. కానీ, ఓ వ్యక్తికి 707 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. ఇంతకు అతడు చేసిన అంత కృరమైన తప్పు ఏంటంటే..

మాథ్యూ (34) అనే వ్యక్తి బేబీకేరింగ్ సేవలు అందించే వృత్తిలో ఉండేవాడు. అయితే.. 2019లో తమ పిల్లాడిని అనుచితంగా తాకాడు అని ఓ జంట మాథ్యూపై లగునా బీచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2014 నుంచి 2019 మధ్య తన వద్ద ఉండే 2 నుంచి 12 ఏళ్ల పిల్లలను 17 మందిని అతడు లైంగికంగా వేధించడం.. వారికి అశ్లీల చిత్రలు చూపించాడని తేలింది.

అయితే అతడు చేసింది క్షమించరాని నేరమని అమెకిరాలోని కాలిఫోర్నియా న్యాయస్థానం 707 ఏళ్లు జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఇంతటి కఠినమైన శిక్ష విధించినా మాథ్యూ మాత్రం పశ్చాత్తాపడలేదని తెలిసింది. అంతే కాకుండా తాను పిల్లలకు ఆనందాన్నే పంచాను అంటూ న్యాయస్థానంలో వెల్లడించాడట. కాగా.. ఇలాంటి కిరాతకుడిని తమ పిల్లల కోసం నియమించుకున్నందుకు బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News