మందిని ముంచి రూ.34.50 లక్షలు సంపాదించారు.. చివరకు పోలీసులకు చిక్కారు!

హవాలా దందా చేస్తున్న ముగ్గురిని సెంట్రల్​జోన్​టాస్క్ ఫోర్స్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​డీసీపీ నితికా పంత్​ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2023-10-30 13:50 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హవాలా దందా చేస్తున్న ముగ్గురిని సెంట్రల్​జోన్​టాస్క్ ఫోర్స్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​డీసీపీ నితికా పంత్​ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శివరాంపల్లి నివాసి శివాన్షు రాయ్​(41) రియల్​ఎస్టేట్​వ్యాపారి. అదే ప్రాంతంలో నివాసముంటున్న మహ్మద్​మన్సూర్​(38) అతని వద్ద డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా నల్లగుట్ట నివాసి, వ్యాపారి అయిన భావేశ్​కుమార్‌తో శివాన్షు రాయ్‌కు స్నేహం ఉంది. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం శివాన్షు రాయ్, భావేశ్​కుమార్‌లకు కొందరు హవాలా ఏజెంట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో తేలికగా డబ్బు సంపాదించటానికి ఇద్దరు కలిసి హవాలా దందా మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి కస్టమర్ల నుంచి రూ.34.50 లక్షలు కలెక్ట్​చేసిన ఈ ఇద్దరు డ్రైవర్​మహ్మద్​మన్సూర్‌తో కలిసి కిమ్స్​ఆస్పత్రి వద్ద నగదును డెలివరీ చేయటానికి కారులో వచ్చారు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్​సీఐ రాజూ నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్​కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం రాంగోపాల్​పేట పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News