ఏసీబీ వలలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఉదయం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఉదయం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. వివరాల్లోకి వెళితే.. ఔషదాల టెండర్ నిమిత్తం డాక్టర్ లచ్చు నాయక్ రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. ఒప్పుకున్న నగదును ఇవాళ ఉదయం ఇంట్లో తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.