మనస్థాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ఫలితాలతో మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని

Update: 2024-04-24 14:56 GMT

దిశ,డోర్నకల్ : ఇంటర్ ఫలితాలతో మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. చిలుకోడు గ్రామానికి చెందిన చిప్ప భార్గవి (17) బుధవారం వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News