crime : కారు ఢీకొని కొడుకు మృతి...తండ్రికి తీవ్ర గాయాలు
వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొని కొడుకు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలైన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, కార్వాన్ : వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొని కొడుకు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలైన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీం బాగ్ ప్రాంతానికి చెందిన రమేష్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే శనివారం తన కొడుకును పక్కనే ఉన్న వైఎస్సార్ కాలనీలో అమ్మమ్మ ఇంటి వద్ద తన బైక్ పై వదిలి పెట్టేందుకు వెళుతుండగా,
ఎదురుగా వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో రమేష్ తో పాటు కొడుకు సూర్యకు (7) తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 100కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా సూర్య మృతి చెందాడు. కాగా కారు డ్రైవర్ శ్రీనాథ్ మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్టు, పోలీసుల ఆధీనంలో నిందితుడు ఉన్నట్లు పేర్కొన్నారు. కారులో శ్రీనాథ్ తో పాటు మరి కొంతమంది ఆయన మిత్రులు మద్యం సేవించి ఉన్నారని, ప్రమాదం కాగానే వారంతా పరారైనట్టు పేర్కొన్నారు.