చోరీ కేసులో ఆరుగురికి జైలు

దొంగతనం కేసులో ఆరుగురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుచరిత శుక్రవారం తీర్పు చెప్పారు.

Update: 2024-09-20 14:24 GMT

దిశ,కొత్తగూడెం : దొంగతనం కేసులో ఆరుగురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుచరిత శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంకు చెందిన జాజిరియా సునీత స్థానిక క్రాస్ రోడ్డు వద్ద బంగారం షాపు నడుపుతున్నారు. 13 .10. 2017న షాపులో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో గుర్తుతెలియని కొందరు మహిళలు బంగారు నగలు చూసి కొనకుండా వెళ్లిపోయారు. షాపు యజమానికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించగా ఒకరు వెండి పట్టీలు దొంగతనం చేస్తుండగా మరొకరు వాటిని దాచిపెడుతూ కనిపించారు. అనంతరం అందరూ కలిసి వెళ్లిపోయారు. వీటి విలువ 7 వేల రూపాయలు ఉంటుంది. అనంతరం నిందితులను వెతకగా వారి ఆచూకీ లభించలేదు.

     దాంతో బాధితురాలు జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సబ్ ఇన్​స్పెక్టర్ పి. శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరంగల్ జిల్లా నరసింహుల పేట మండలం పకీర తండా, బొడ్డు తండాలకు చెందిన గుగులోతు కోబి, భూక్య మంక్తి, భూక్య అంకు, భూక్యా సీత, ఆంగోతు రాజి, లాకావత్ కాళీ దొంగతనం చేసినట్టు గుర్తించి వారి వద్ద నుంచి వెండి పట్టీలు రికవరీ చేశారు. దర్యాప్తు అనంతరం ఆరుగురు మహిళలపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. వారిపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను విశ్వశాంతి, నాగలక్ష్మి నిర్వహించారు. సబ్ ఇన్​స్పెక్టర్ వి.రామమూర్తి, లైజాన్ ఆఫీసర్ ఎస్​కే. అబ్దుల్ ఘని, జూలూరుపాడు పీసీ పి.ఉపేందర్ రావు సహకరించారు. 

Tags:    

Similar News