ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి..ఆపై హత్య: గోవాలో దారుణం
గోవాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి..ఆపై హత్య చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: గోవాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి..ఆపై హత్య చేశారు. సౌత్ గోవా ఎస్పీ సునీతా సావంత్ తెలిపిన వివరాల ప్రకారం..వాస్కో ప్రాంతానికి చెందిన ఓ ఐదేళ్ల బాలిక కొంత కాలంగా కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే బాలిక మృత దేహాన్ని స్థానికంగా నిర్మిస్తున్న ఓ భవనం వెనక శుక్రవారం కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక శరీరంపై గాయాలు ఉండటంతో పోస్టు మార్టం నిర్వహించగా.. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడైంది. లైంగిక దాడి అనంతరం నిందితులు బాలిక గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్న 20మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఐపీసీ376, 302, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్థానికంగా నివాసముండే వారందరినీ విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో స్పందించారు. గోవా ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. దీనిపై త్వరలోనే మరిన్న వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.