కిరాణా షాప్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం
నగరంలో గంజాయి మాఫియా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో గంజాయి మాఫియా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. గంజాయి అమ్మకం దారులు తమ రూటును మారుస్తున్నారు. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహానగరాన్ని పోలీసులు, ఇతర శాఖల అధికారులు జల్లెడ పడుతూ గంజాయి వినియోగ, అమ్మకందారులపై పంజా విసురుతున్నారు. ఇందులో భాగంగా..ఈ క్రమంలో మేడ్చల్ ఎస్ వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆదివారం ఉదయం సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుబాష్ నగర్‌లోని కోమల్ కిరాణా షాప్‌లో గంజాయి చాకెట్లను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఆ షాపు యజమాని పివేష్ పాండ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కిరాణా షాప్ లో 5 ప్యాకెట్లతో 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు గత ఆరు నెలలుగా గంజాయి చాక్టెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.