ఆత్మహత్య చేసుకుంటా.. అఖిల్​పహిల్వాన్​సంచలన స్టేట్‌మెంట్

తాను వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించినట్టుగా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఫార్చూన్​లాడ్జీ కేసులో అరెస్టయిన అఖిల్​పహిల్వాన్​పోలీసుల విచారణలో అన్నట్టుగా తెలిసింది.

Update: 2024-01-28 15:06 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తాను వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించినట్టుగా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఫార్చూన్​లాడ్జీ కేసులో అరెస్టయిన అఖిల్​పహిల్వాన్​పోలీసుల విచారణలో అన్నట్టుగా తెలిసింది. అసలు, లాడ్జీలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నట్టు సమాచారం. ఆబిడ్స్‌లోని ఫార్చూన్​లాడ్జీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఇటీవల టాస్క్​ఫోర్స్​పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. లాడ్జీలో 25 గదులు ఉండగా 16 గదుల్లో యువతులు ఉన్నట్టుగా గుర్తించిన టాస్క్​ఫోర్స్​పోలీసులు విచారణలో వీళ్లంతా వ్యభిచార కార్యలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారించుకున్నారు. యువతులందరూ పశ్చిమబంగ రాష్ర్టానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అఖిల్​పహిల్వాన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. యువతులు, అరెస్ట్​అయిన నిందితులను ఆబిడ్స్​పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ యువతులను స్టేట్​హోంకు తరలించిన ఆబిడ్స్​పోలీసులు అరెస్ట్​అయిన అఖిల్​పహిల్వాన్​తోపాటు మిగతా ఇద్దరిని కోర్టులో హాజరు పరిచి జ్యుడిషియల్​రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఈ కేసులో అరెస్ట్​అయిన అఖిల్​పహిల్వాన్‌కు టాలీవుడ్‌తోపాటు బుల్లితెరకు చెందిన పలువురు నటులతో పరిచయాలు ఉన్నట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో అఖిల్​పహిల్వాన్​టాలీవుడ్, బుల్లితెర నటుల వద్దకు అఖిల్​పహిల్వాన్​యువతులను పంపించినట్టుగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు అఖిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్​తదితర పార్టీలకు చెందిన కొందరు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​అయ్యాయి. ఈ క్రమంలో ఆబిడ్స్​పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టయిన అఖిల్​పహిల్వాన్‌తో పాటు మిగితా ఇద్దరిని అయిదు రోజులపాటు కస్టడీకి అనుమతించాంటూ కోర్టులో పిటీషన్​దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దాంతో అఖిల్​పహిల్వాన్, మిగితా ఇద్దరిని కస్టడీకి తీసుకున్న ఆబిడ్స్​పోలీసులు మూడు రోజులపాటు వారిని విచారించారు.

దీంట్లో వ్యభిచార కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదని అఖిల్​పహిల్వాన్​చెప్పినట్టుగా తెలిసింది. తనకు సంబంధం ఉన్నట్టుగా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని అన్నట్టు సమాచారం. లాడ్జీలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, గదులు ఫుల్​గా ఉన్నపుడు వచ్చే ఆదాయాన్ని మాత్రమే సిబ్బంది తనకు పంపించేవారని చెప్పినట్టుగా తెలిసింది. బోనాల పండుగ సమయంలో రాంనగర్​ప్రాంతంలో భారీ ఎత్తున ఊరేగింపు జరుపుతానని, ఈ క్రమంలోనే తనకు టాలీవుడ్, బుల్లితెర నటులతోపాటు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయని చెప్పినట్టుగా తెలియవచ్చింది. తన తండ్రి సుజుకీ శ్రీను స్పూర్తిగా తాను పహిల్వాన్​గా మారానని, కుస్తీ పోటీల్లో కూడా పాల్గొన్నానని చెప్పినట్టుగా సమాచారం.

Tags:    

Similar News